వెబ్‌ సిరీస్‌లో మాత్రం చెఫ్‌ రోల్‌ చేశా : ప్రియమణి

Actress Priyamani Says She Dont Even Know How To Boil An Egg - Sakshi

హీరోయిన్‌ ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, టీవీషోలు సహా వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తుంది. తాజాగా ఆమె బాలీవుడ్‌లో 'హిజ్ స్టోరీ' అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ​బాలాజీ టెలిఫిలింస్, డింగ్ ఇన్ఫినిటీ సంస్థలు సంయుక్తంగా నిర్మంచిన ఈ సిరీస్‌ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో పాల్గొన్న ప్రియమణి పలు ఇంట్రెస్టింగ్‌ విశేషాలను షేర్‌ చేసుకుంది. 'ఈ వెబ్‌ సిరీస్‌లో తాను సాక్షి అనే చెఫ్‌ పాత్ర పోషిస్తున్నాని, రియల్‌ లైఫ్‌లో అసలు తనకు అసలు వంట చేయడమే రాదని పేర్కొంది.

నిజం చెప్పాలంటే నాకు కోడిగుడ్డు ఉడకబెట్టడం కూడా రాదు. సెట్‌లో ఉన్న అబ్బాయిలు బాగా వంట చేసేవారు. ఈ సిరీస్‌లో వంట సీన్లు వచ్చినప్పుడు నేను వంట చేయడం చూసి వాళ్లంతా నవ్వుకునేవారు, నాపై జోకులు వేసేవారు' అని ప్రియమణి తెలిపింది. ఈ సిరీస్‌లో తాను పోషించిన చెఫ్‌ రోల్‌ చాలా కీలకమైనది, ప్రేక్షకులందరికీ నచ్చుతుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రియమణి తెలుగులో 'విరాటపర్వం', 'నారప్ప' చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్‌లోనూ అజయ్ దేవగణ్ తో కలిసి 'మైదాన్' చిత్రంలో నటిస్తోంది.

చదవండి : వైరల్‌గా మారిన 'మై విలేజ్ షో' అనిల్ లగ్నపత్రిక
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రభాస్‌.. వైరలవుతోన్న ఫోటోలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top