ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా? | Actress Priyamani Buys New Mercedes-Benz GLC Car; Pics Viral - Sakshi
Sakshi News home page

Priyamani New Car: వరస సినిమాల్లో ఛాన్సులు.. కొత్త కారు కొనేసింది

Published Sat, Feb 24 2024 4:27 PM

Actress Priyamani New Benz Car Cost And Details - Sakshi

హీరోయిన్ ప్రియమణి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కథానాయికగా కొన్నేళ్ల పాటు వరస సినిమాలు చేసింది గానీ ఆ తర్వాత ఛాన్సులు తగ్గిపోయాయి. మరోవైపు పెళ్లి కూడా చేసుకుంది. దీంతో ఈమె పనైపోయిందనుకున్నారు. కానీ బంతిని గట్టిగా బౌన్స్ అయింది. ఓటీటీ, సహాయ పాత్రల్లో నటిస్తూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ బ్యూటీ.. ఇప్పుడైన ఖరీదైన కారు కొనుగోలు చేసింది.

కర్ణాటకకు చెందిన ప్రియమణి.. తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2003లో నటిగా ఈమె కెరీర్ మొదలవగా.. తెలుగులో బోలెడన్ని చిత్రాలు చేసింది. మధ్యలో తమిళ, మలయాళంలోనూ నటించింది. 2012-13 మధ్యలో ఈమెకు ఛాన్సులు బాగా తగ్గిపోయాయి. దీంతో ఈమె కెరీర్ ఇక అయిపోయినట్లే అనుకున్నారు. దీంతో టీవీ షోలు చేస్తూ వచ్చింది. 2017లో ముస్తాఫా అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది.

(ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

అలా పెళ్లి చేసుకుని గృహిణి అయిన తర్వాత ప్రియమణి.. 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ దెబ్బకు ప్రియమణి దశ తిరిగిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఛాన్సులు వరసపెట్టి వచ్చాయి. 'భామా కలాపం' లాంటి సినిమాల్లో హీరోయిన్‌గా.. జవాన్, నెరు, కస్టడీ తదితర చిత్రాల్లో ప్రాధాన్యమున్న సహాయ పాత్రలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇలా అనుకోని విధంగా మళ్లీ ఫామ్‍‌లోకి వచ్చిన ప్రియమణి.. తాజాగా ఖరీదైన జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్‌సీ కొనుగోలు చేసింది. మార్కెట్‌లో దీని ధర రూ.74 లక్షల వరకు ఉంది. ఇప్పటికే కొన్ని కాస్ట్ లీ కార్స్ ఈమె దగ్గర ఉండగా.. ఇప్పుడీ కారు ప్రియమణి గ్యారేజీలో చేరింది.

(ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?)

Advertisement

తప్పక చదవండి

Advertisement