మీ చేతిలో కీలుబొమ్మలం కాదు.. స్నేహితురాలిని పెళ్లాడిన నటి!? | Actress Prarthana Krishna Gives Clarity On Wedding Video Went Viral, Deets Inside | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ ఫ్రెండ్‌తో నటి పెళ్లి?! అబ్బాయిలకంటే తనే నయం!

Jul 2 2025 1:59 PM | Updated on Jul 2 2025 3:20 PM

Actress Prarthana Krishna Clarifies on Wedding Video

క్రూరమైన మగాళ్ల కన్నా నా బెస్ట్‌ ఫ్రెండ్‌ (మోడల్‌ అన్సియా) చాలా బెటర్‌. అందుకే తనను పెళ్లి చేసుకున్నా అని ఓ వీడియో రిలీజ్‌ చేసింది మలయాళ బుల్లితెర నటి ప్రార్థన కృష్ణ నాయర్‌ (Prarthana Krishna N Nair). ఆ వీడియోలో నటి, తన స్నేహితురాలితో గుడికి వెళ్లింది. అక్కడ వీరిద్దరూ దండలు మార్చుకున్నారు. ఒకరి మెడలో మరొకరు పసుపు తాడు కట్టారు. 

మీ చేతిలో కీలుబొమ్మలం కాదు
నుదుటన కుంకుమ దిద్ది జంటగా అడుగులు వేశారు. ఈ ఇద్దరమ్మాయిల పెళ్లి వీడియో నెట్టింట విపరీతంగా వైరల్‌ అయింది. ఆడవాళ్లందరూ మీ చేతిలో కీలుబొమ్మలు కాదు. రియల్‌ లైఫ్‌లో నటించేవా మగవాళ్లకు మా జీవితాల్లో చోటు లేదు అని నటి క్యాప్షన్‌ ఇచ్చింది. ఇది చూసిన కొందరు వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? అని ఆశ్చర్యపోయారు.

అసలు విషయమిదే!
తాజాగా ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చింది ప్రార్థన. మేము చాలా వైరల్‌ అయిపోయాం. మా పెళ్లి నిజం కాదు, అది కేవలం షూటింగ్‌ మాత్రమే! వేరే ఇండస్ట్రీకి చెందిన నటులు ఇలాగే చేశారు. అది చూసి మేము కూడా ట్రై చేశామంతే! తను నా బెస్ట్‌ ఫ్రెండ్‌. తనకిదివరకే పెళ్లయింది, ఓ బాబు కూడా ఉన్నాడు అంటూ అసలు విషయం బయటపెట్టింది.

 

 

చదవండి: ప్రియాంక బర్త్‌డే.. కాలి చెప్పుపై కేక్‌.. 'తిండితో ఆటలా?'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement