Payel Sarkar: నటికి ఫేక్‌ డైరెక్టర్‌ అసభ్య సందేశాలు

Actress Payel Sarkar File Complaint On Director Fake Account: Details Inside - Sakshi

Actress Payel Sarkar: ప్రముఖ డైరెక్టర్‌ పేరిట ఓ వ్యక్తి తనకు అసభ్యకర సందేశాలు పంపుతున్నాడంటూ బెంగాలీ బుల్లితెర నటి పాయల్‌ సర్కార్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించింది.ఫేక్‌ అకౌంట్‌ ద్వారా సదరు వ్యక్తి తనకు తరచూ నీచమైన మెసేజ్‌లు చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. బుల్లితెర నటి పాయల్‌ సర్కార్‌కు సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. అతడి ప్రొఫైల్‌ ఓపెన్‌ చేసి చూడగా ప్రముఖ బెంగాలీ దర్శకుడు రవి కినాగి ఫొటోలు దర్శనమిచ్చాయి. దీంతో పాటు అతడి సినిమాలకు సంబంధించిన వివరాలు కూడా ఉండటంతో సదరు వ్యక్తి నిజంగానే దర్శకుడని నటి నమ్మేసింది.

దీంతో ఆదివారం ఆ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేసింది. అతడు మాట కలుపుతూ.. తను తీయబోయే సినిమాలో ప్రధాన పాత్ర ఇప్పిస్తానని నటికి ఆశ చూపించాడు. అందుకు ఆమె సంతోషించేలోపే నీచమైన మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు. దీంతో పాయల్‌కు అది డైరెక్టర్‌ అకౌంటేనా? లేదా ఫేక్‌ అకౌంటా? అన్న అనుమానం మొదలైంది. ఆ అనుమానానికి ఆజ్యం పోస్తూ అతడు వరుసగా అసభ్య సందేశాలు పంపాడు. వెంటనే ఆమె ఆ మెసేజ్‌లను స్క్రీన్‌షాట్లు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. అతడి ప్రొఫైల్‌ చూసిన ఆమె అభిమానులు, స్నేహితులు వాళ్లు దాన్ని ఫేక్‌ అకౌంట్‌ అని తేల్చగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. బరక్‌పూర్‌ పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

కాగా సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లతో ఆడవారిని వేధించే ఇలాంటి దుర్మార్గులను శిక్షించాల్సిందేనంటోంది పాయల్‌. మరోవైపు తన పేరు మీద ఫేక్‌ ఐడీలు క్రియేట్‌ చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని దర్శకుడు రవి సైబర్‌ పోలీసులను కోరినట్లు సమాచారం. అంతేకాకుండా సినిమా అవకాశం కావాలంటే తనకు ఫోన్‌ చేయడమో లేదా కార్యాలయానికి రావాలే తప్ప ఇలా సోషల్‌ మీడియాలో రిక్వెస్టులు పంపకూడదని  సూచించాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top