Actress Meena: ఇటీవల భార్యకు ఆ హీరో విడాకులు.. ఇప్పుడు మీనాతో రెండో పెళ్లి! నటుడు సంచలన వ్యాఖ్యలు

Actress Meena Second Marriage With Tamil Star Hero - Sakshi

టాలీవుడ్‌ నటి మీనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. గతేడాది జూన్‌లో భర్త విద్యాసాగర్‌ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. చాలా గ్యాప్‌తో తర్వాత ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మీనా తమిళం, మలయాళంలోనూ పలు చిత్రాలకు సైన్‌ చేసింది. ఇదిలా భర్తను కొల్పోయిన బాధలో ఉన్న మీనాపై సోషల్‌ మీడియాలో రకరకాలు పుకార్లు వినిపిస్తున్నాయి.

చదవండి: అప్పట్లోనే సొంత హెలికాప్టర్‌, వేల కోట్ల ఆస్తులు.. నటి కేఆర్‌ విజయ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

ఆమె రెండో పెళ్లికి సిద్ధమైందంటూ కొద్ది రోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తన పెళ్లి వార్తలపై స్పందించిన మీనా తీవ్రంగా ఖండిచింది. అయినప్పటికీ ఆమె రెండో పెళ్లికి సంబంధించిన రూమర్స్‌కు మాత్రం చెక్‌ పడటం లేదు. తాజాగో ఓ సినీ క్రిటిక్‌, నటుడు తమిళ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మీనా రెండో పెళ్లిపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మీనా త్వరలోనే ఓ తమిళ స్టార్‌ హీరోను పెళ్లి రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఆ హీరో పాన్‌ ఇండియా స్టార్‌ అని, గతేడాది భార్యతో విడాకులు తీసుకున్ని విడిపోయాడంటూ హింట్‌ ఇచ్చాడు. అంతేకాదు ఆ హీరో మీనా కంటే చిన్నవాడని, నిశ్చితార్థానికి కూడా ముహుర్తం పెట్టుకున్నారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్‌ కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. సోషల్‌ మీడియాలో అతడి వ్యాఖ్యలు వైరల్‌ అవుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతడి కామెంట్స్‌ని కొట్టిపారేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం ఎలా చేస్తారు?’,‘ఏదైనా చెబితే నమ్మే విధంగా ఉండాలి’ అంటూ సదరు ఫిలిం క్రిటిక్‌కు చురకలు అట్టిస్తున్నారు.

చదవండి: నాటు నాటుకు ఆస్కార్‌.. అజయ్‌ దేవగన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

కాగా గతంలోనే మీనా తాను తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని మీనా ఇటీవల ఓ ఇంటర్య్వూలో తేల్చి చెప్పిన సంగతి తెలిసింది. ఓ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మీనాకు రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నా భర్త చనిపోయినప్పటి నుంచి సోషల్‌ మీడియాలో నా గురించి ఆసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్‌ కాదు. బాధలో ఉన్న నాకు ఇలాంటి వార్తలు మరింత బాధిస్తున్నాయి. అసలు నాకు మరో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు’ అంటూ మీనా కుండ బద్దలు కొట్టారు. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top