Actress Avika Gor Latest Photos Goes Viral | Download HD Images
Sakshi News home page

Avika Gor: అందంతో కట్టిపడేస్తోన్న అవికా, ఫొటోలు వైరల్‌

Nov 15 2021 1:03 PM | Updated on Nov 15 2021 3:15 PM

Actress Avika Gor Latest Photos Goes Viral - Sakshi

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో చైల్డ్‌ అర్టిస్ట్‌గా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది నటి అవికా గోర్‌. తెలుగులో 'ఉయ్యాల జంపాల' మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' వంటి వరుస సినిమాల్లో నటించిన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆ తర్వాత సినిమాలకు కాస్తా బ్రేక్‌ ఇచ్చిన అవికా ఆ తర్వాత బాలీవుడ్‌కు మాకాం మార్చింది.

ఈ క్రమంలో అక్కడ ప్రైవేటు సాంగ్స్‌, అల్భమ్స్‌తో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో నాగచైతన్య, రాశిఖన్నాల థ్యాంక్యూ చిత్రంతో తిరిగి తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఇటీవల నెట్‌ సినిమాతో ఫ్యాన్స్‌ను పలకరించింది. ఇక ఇప్పుడు ఆమె ‘బ్రో’ అనే కొత్త సినిమాతో రాబోతోంది.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరగగా ఈ కార్యక్రమంలో అవికా సందడి చేసింది. ఈ సందర్భంగా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. బ్రో చిత్రంలో నటుడు నవీన్‌ చంద్రకు చెల్లెలిగా నటించింది అవికా.

ఇదిలా ఉంటే అవికా హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో కొంతకాలంగా ప్రేమయాణం సాగిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న అవికా తన ప్రేమ, పెళ్లిపై స్పందిస్తూ.. హైదరాబాద్‌కు చెందిన మిలింద్‌ చంద్వానీతో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు చెప్పింది. త్వరలోనే అతడితో ఏడడుగులు కూడా వేయబోతున్నట్లు స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement