పెళ్లి గురించి హింట్ ఇచ్చేసిన తెలుగు హీరోయిన్.. త్వరలో శుభవార్త | Sakshi
Sakshi News home page

Anjali: ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేశారు.. నిజంగా ఎప్పుడు చేసుకుంటానంటే

Published Wed, May 29 2024 7:29 AM

Actress Anjali Respond On Marriage Rumours

జనాల్లో హీరోయిన్ల పెళ్లిళ్ల మీద ఉన్న ఆసక్తి మరి దేనిపైనా ఉండదేమో? వారు ప్రేమలో పడితే వార్త, పెళ్లి కాకపోతే వార్త, పెళ్లి అయితే వార్త.. ఇలా ఉంటుంది హీరోయిన్ల పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఇలాంటి వాటి వల్ల వాళ్లకి పెద్ద తలనొప్పి అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి వాటిని కొందరు ఎంజాయ్ చేస్తారు. కాగా హీరోయిన్ అంజలి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. కారణం ఈమెకు 36 ఏళ్లు.

(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది)

మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు అంజలిని వెంటాడుతూనే ఉన్నాయి. తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు కథానాయికగా చేస్తూనే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా చేస్తోంది. కొన్నాళ్ల క్రితం ఈమె రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే న్యూస్ వచ్చింది. అందరూ ఇది నిజమే అనుకున్నారు. కానీ ఇది కేవలం రూమర్ మత్రమే అని తేలింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి రూమర్స్‌పై స్పందించింది.

ఇప్పటికే నాకు మూడు నాలుగు పెళ్లిళ్లు చేశారు. మొదట్లో ఇలాంటి వార్తలు విన్నపుడు బాధపడ్డా కానీ ఆ తర్వాత పట్టించుకోవడం మానేశానని అంజలి చెప్పింది. తనపై వస్తున్న వదంతుల కారణంగా నిజంగా ఓ వ్యక్తిని తీసుకెళ్లి ఇతన్నే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పినా ఇంట్లో ఎవరూ నమ్మరని చెప్పుకొచ్చింది. తను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని కానీ దానికి చాలా టైమ్ ఉందని క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం నటిగా బిజీగా ఉన్నానని ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే మూవీస్ చేస్తానని మాటిచ్చింది.

(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?)

Advertisement
 
Advertisement
 
Advertisement