అలాంటి సన్నివేశాల్లో నటించడం కష్టం | Actress Anjali about intimate Scenes | Sakshi
Sakshi News home page

అలాంటి సన్నివేశాల్లో నటించడం కష్టం

Jul 25 2024 1:16 PM | Updated on Jul 25 2024 1:16 PM

Actress Anjali about intimate Scenes

జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. ఆ విషయాన్ని పక్కన పెడితే నటి అంజలి చేసే పాత్రలన్నీ కచ్చితంగా వైవిధ్యంగా ఉంటున్నాయి. ఈమె కథానాయకిగా నటించినా, ఐటమ్‌ సాంగ్‌లో నటించినా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. తమిళంలో కట్రదు తమిళ్‌, అంగాడి తెరు, అరవాన్‌, ఇరైవి, తరమణి వంటి చిత్రాల్లో అంజలి నటనే ఇందుకు నిదర్శనం. 

అలాగే తెలుగులోనూ గీతాంజలి, సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు వంటి చిత్రాలు అంజలిలోని నటనకు అద్దం పట్టాయి. కాగా ఈమె తాజాగా నటించిన ఏళు కడల్‌ ఏళు మలై త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అవార్డులు, ప్రశంసలను అందుకుంది. అలాగే తెలుగులో శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ చిత్రంలో రామ్‌చరణ్‌కు జంటగా నటించారు. 

కాగా అంజలి తెలుగులో నటించిన బహిష్కరణ వెబ్‌ సిరీస్‌ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. ఇందులో ఈమె బెడ్‌రూమ్‌ సన్నివేశాల్లో, సహా నటుడితో రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడం చర్చనీయాంశంగా మారింది. దీని గురించి అంజలి ఒక భేటీలో పేర్కొంటూ రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడం కష్టతరం అన్నారు. చిత్రం యూనిట్‌లో పలువురు మగవారి మధ్య అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందని, ఆ పరిస్థితుల్లో నటించడం కష్టం అని అంజలి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement