వాచ్‌మెన్‌గా పనిచేశా.. బిచ్చగాడిగా కూడా సెట్‌ కాదన్నారు: నటుడు | Actor Vinod Suryavanshi Shares His Career Starting Struggle | Sakshi
Sakshi News home page

తింటుంటే లేపేశారు.. బిచ్చగాడి పాత్ర కూడా సెట్‌ కాదన్నారు : నటుడు

Apr 22 2026 4:57 PM | Updated on Apr 22 2026 5:29 PM

Actor Vinod Suryavanshi Shares His Career Starting Struggle

సినిమా నటులు అనగానే కోట్ల సంపాదన, లగ్జరీ లైఫ్‌ అనుకుంటారు. నిజమే అలానే బతుకుతారు. కానీ వాళ్లు ఆ స్థాయికి చేరుకోవడానికి చాలానే కష్టపడతారు. ఇప్పుడు స్టార్స్‌గా రాణిస్తున్నవారిలో చాలా మంది ఒకప్పుడు పేదరికాన్ని అనుభవించి వచ్చినవాళ్లే. అలాంటి వాళ్లలో బాలీవుడ్‌ నటుడు వినోద్‌ సూర్యవంశీ ఒకరు. అక్షయ్‌ కుమార్‌ ‘ఎల్‌ఎల్‌బి 3’, పంచాయత్‌ లాంటి సిరీస్‌తో బాలీవుడ్‌లో మంచి గుర్తించు తెచ్చకున్న  ఈ నటుడు.. ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాడట. రూ. 500 కోసం సినిమాల్లోకి వచ్చి.. ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి నటుడిగా స్థిరపడిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో  వినోద్‌ తన సినిమా జర్నీ ఎలా మొదలైందో వివరించాడు.

(చదవండి: ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు)

వాచ్‌ మెన్‌గా పనిచేశా..
చిన్నప్పుడు నా జీవితం చాలా ఘోరంగా ఉండేది. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. పండగలు వస్తే.. భయపడిపోయేవాళ్లం. అమ్మ-నాన్నల కష్టం చూడలేక.. కొన్నాళ్ల పాటు లిఫ్ట్‌ మ్యాన్‌గా పని చేశారు. ఆ తర్వాత వాచ్‌మెన్‌గా చేశా. ఆ సమయంలో దాదాపు 12 గంటల పాటు నిలబడి ఉండేవాడిని. వర్షం వస్తే.. షూలోకి నీళ్లుపోయి..తీవ్రమైన నొప్పి వచ్చేవి.

రూ. 500 కోసం.. 
నేను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చా. వాచ్‌మెన్‌గా చేస్తున్న సమయంలో నా స్నేహితుడు ఒకడు వచ్చి షూటింగ్‌లో నిలబడితే రూ. 500 ఇస్తారని చెప్పి నన్ను తీసుకెళ్లాడు. అలా జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌ ప్రారంభం అయింది. అప్పట్లో రోజుకు రూ. 500 ఇచ్చేవాళ్లు. టిఫిన్‌, లంచ్‌ పెట్టేవాళ్లు. అప్పటికే అది నాకు చాలా గొప్పది. వాన్‌మెన్‌గా 12 గంటలు పని చేస్తే నెలకు రూ. 8000 మాత్రమే వచ్చేవి. కానీ జూనియర్‌ ఆర్టిస్ట్‌గా రూ. 12000 సంపాదించా.

తింటుంటే లేపేశారు
అలా అని జూనియర్‌ ఆర్టిస్ట్‌ లైఫ్‌ గొప్పగా ఉంటుందని నేను చెప్పను. వాళ్లకు కనీస గౌరవం కూడా ఇవ్వరు. జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నప్పుడు ఓ సారి నేను సెట్‌లో భోజం చేస్తున్నాను. కొంతమంది వచ్చి..నన్ను పక్కకు వెళ్లమన్నారు. దూరంలోని నిలబడి తనమన్నారు. ఎందుకంటే నేను జూనియర్‌ ఆర్టిస్ట్‌ని అని. అప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నా. నన్ను గౌరవించాలంటే.. నేను కూడా యాక్టర్‌ని కావాలనుకున్నా. చాలా కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా.

బిచ్చగాడి పాత్రకు కూడా సెట్‌ కాదన్నారు
కెరీర్‌ ప్రారంభంలో నేను చాలా కష్టాలు అనుభవించా. చాలా పాత్రలకు నన్ను రిజెక్ట్‌ చేశారు. కొన్ని పాత్రలు అయితే షూటింగ్‌ ప్రారంభించిన తర్వాత ఆగిపోయాయి. సెట్‌లోకి వెళ్లిన తర్వాత.. నల్లగా ఉన్నావని చెప్పి రిజెక్ట్‌ చెశారు. చివరకు బిచ్చగాడి పాత్రకి కూడా రిచ్‌ లుక్‌ లేదని నన్ను పక్కన పెట్టారు. ఇలా మొదట్లో నాకు చాలా అవమానాలు జరిగాయి’ అని సూర్య చెప్పుకొచ్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement