Vinod Suryavanshi
-
వాచ్‌మెన్‌గా పనిచేశా.. బిచ్చగాడిగా కూడా సెట్ కాదన్నారు: నటుడు
సినిమా నటులు అనగానే కోట్ల సంపాదన, లగ్జరీ లైఫ్ అనుకుంటారు. నిజమే అలానే బతుకుతారు. కానీ వాళ్లు ఆ స్థాయికి చేరుకోవడానికి చాలానే కష్టపడతారు. ఇప్పుడు స్టార్స్‌గా రాణిస్తున్నవారిలో చాలా మంది ఒకప్పుడు పేదరికాన్ని అనుభవించి వచ్చినవాళ్లే. అలాంటి వాళ్లలో బాలీవుడ్ నటుడు వినోద్ సూర్యవంశీ ఒకరు. అక్షయ్ కుమార్ ‘ఎల్ఎల్బి 3’, పంచాయత్ లాంటి సిరీస్‌తో బాలీవుడ్లో మంచి గుర్తించు తెచ్చకున్న ఈ నటుడు.. ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాడట. రూ. 500 కోసం సినిమాల్లోకి వచ్చి.. ఇప్పుడు బాలీవుడ్లో మంచి నటుడిగా స్థిరపడిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినోద్ తన సినిమా జర్నీ ఎలా మొదలైందో వివరించాడు.(చదవండి: ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు)వాచ్ మెన్‌గా పనిచేశా..చిన్నప్పుడు నా జీవితం చాలా ఘోరంగా ఉండేది. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. పండగలు వస్తే.. భయపడిపోయేవాళ్లం. అమ్మ-నాన్నల కష్టం చూడలేక.. కొన్నాళ్ల పాటు లిఫ్ట్ మ్యాన్‌గా పని చేశారు. ఆ తర్వాత వాచ్‌మెన్‌గా చేశా. ఆ సమయంలో దాదాపు 12 గంటల పాటు నిలబడి ఉండేవాడిని. వర్షం వస్తే.. షూలోకి నీళ్లుపోయి..తీవ్రమైన నొప్పి వచ్చేవి.రూ. 500 కోసం.. నేను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చా. వాచ్‌మెన్‌గా చేస్తున్న సమయంలో నా స్నేహితుడు ఒకడు వచ్చి షూటింగ్లో నిలబడితే రూ. 500 ఇస్తారని చెప్పి నన్ను తీసుకెళ్లాడు. అలా జూనియర్ ఆర్టిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభం అయింది. అప్పట్లో రోజుకు రూ. 500 ఇచ్చేవాళ్లు. టిఫిన్, లంచ్ పెట్టేవాళ్లు. అప్పటికే అది నాకు చాలా గొప్పది. వాన్మెన్గా 12 గంటలు పని చేస్తే నెలకు రూ. 8000 మాత్రమే వచ్చేవి. కానీ జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 12000 సంపాదించా.తింటుంటే లేపేశారుఅలా అని జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్ గొప్పగా ఉంటుందని నేను చెప్పను. వాళ్లకు కనీస గౌరవం కూడా ఇవ్వరు. జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నప్పుడు ఓ సారి నేను సెట్లో భోజం చేస్తున్నాను. కొంతమంది వచ్చి..నన్ను పక్కకు వెళ్లమన్నారు. దూరంలోని నిలబడి తనమన్నారు. ఎందుకంటే నేను జూనియర్ ఆర్టిస్ట్‌ని అని. అప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నా. నన్ను గౌరవించాలంటే.. నేను కూడా యాక్టర్‌ని కావాలనుకున్నా. చాలా కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా.బిచ్చగాడి పాత్రకు కూడా సెట్ కాదన్నారుకెరీర్ ప్రారంభంలో నేను చాలా కష్టాలు అనుభవించా. చాలా పాత్రలకు నన్ను రిజెక్ట్ చేశారు. కొన్ని పాత్రలు అయితే షూటింగ్ ప్రారంభించిన తర్వాత ఆగిపోయాయి. సెట్లోకి వెళ్లిన తర్వాత.. నల్లగా ఉన్నావని చెప్పి రిజెక్ట్ చెశారు. చివరకు బిచ్చగాడి పాత్రకి కూడా రిచ్ లుక్ లేదని నన్ను పక్కన పెట్టారు. ఇలా మొదట్లో నాకు చాలా అవమానాలు జరిగాయి’ అని సూర్య చెప్పుకొచ్చాడు. -
ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు
హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ, 'పంచాయత్' సిరీస్‌లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న వినోద్ సూర్యవంశీ.. ఇప్పటికీ తన కుటుంబం కర్ణాటకలోని తన సొంతూరిలో కుల వివక్ష ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చాడు. ప్రముఖ యూట్యూబర్ సిద్ధార్థ్ కన్నన్‌తో జరిగిన సంభాషణలో భాగంగా ఈ ఆశ్చర్యకర సంగతి చెప్పి షాకిచ్చాడు. పేదరికం కారణంగా తను ఇప్పటివరకు ఎలాంటి వివక్ష ఎదుర్కొన్నాడో చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో విషాదం.. చనిపోయిన ప్రముఖ దర్శక నిర్మాత)'మా ఊరిలో ఇప్పటికీ అగ్ర కులాలు, బలహీన వర్గాల కోసం వేర్వేరు ప్రాంతాలున్నాయి. దళితులు నివసించే ప్రాంతం గ్రామానికి దూరంగా ఉంటుంది. నాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు నాన్నతో కలిసి ఊరి లోపలికి వెళ్లినప్పుడు ఓ హోటల్లో తిన్నాం. కానీ తర్వాత మేమే ప్లేట్లు కడగాల్సి వచ్చింది. అలానే ఇప్పటికీ ఊరిలోని దేవాలయంలోకి మాకు అనుమతి లేదు' అని వినోద్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.ఇక చిన్నప్పటి కష్టాలు గుర్తుచేసుకున్న వినోద్.. పండగలు వచ్చాయంటే సంతోషం కంటే మాకు బాధే ఎక్కువగా ఉండేది. దీపావళి ఎందుకు వస్తుందా అనిపించేంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇస్తే మాత్రమే మేం పండగ జరుపుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కుటుంబం విషయానికొస్తే.. నా తల్లి ఇళ్లలో పనిచేసేది. నాన్న మేస్త్రీ. ఆయనకు రోజూ పని దొరికేది కాదు. పనిలేకపోతే తాగొచ్చి అమ్మని ఇష్టమొచ్చినట్లు కొట్టేవాడు. ఆయనంటే కోపం లేదు కానీ ఎందుకనో నాన్న ప్రవర్తన నచ్చేది కాదని అన్నాడు.సినిమా కెరీర్ గురించి చెబుతూ.. ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో పనులు చేశాను. మొదటి లిఫ్ట్ మ్యాన్‌గా నెలకు రూ.1600 జీతానికి పనిచేశా. తర్వాత ఆఫీస్ బాయ్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేశాను. గార్డ్‌గా పనిచేసినప్పుడు 12 గంటలు నిలబడి పనిచేయాల్సి వచ్చేది. వర్షం పడితే చెప్పుల్లోకి నీళ్లు చేరి గాయాలయ్యేవి. కొందరు అకారణంగా తిట్టేవారని వినోద్ గుర్తుచేసుకున్నాడు. ఏ పని చిన్నది కాదంటారు గానీ నిజానికి మనిషిని అతడు చేసే పనిబట్టి అంచనా వేస్తారు. పని పెద్దదైతేనే గౌరవం కూడా ఎక్కువగా ఉంటుందని వినోద్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. హిందీలో పంచాయత్ సిరీస్‌తో పాటు జాన్వర్, థామా, సత్యమేవ జయతే, జాలీ ఎల్ఎల్బీ 3 తదితర సినిమాల్లో వినోద్ సూర్యవంశీ నటించాడు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ కామెడీ సినిమా)


