
తాన్యా దేశాయ్, వినోద్ కుమార్, శ్రీనివాస్
తాన్యాదేశాయ్, అంకిత్ రాజ్, కావ్యా రెడ్డి, వినోద్ కుమార్ ముఖ్య పాత్రల్లో విశ్వ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్ట్రీట్ లైట్’. మామిడాల శ్రీనివాస్ నిర్మింన ఈ సినిమా ఈ నెల మూడో వారంలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘నా మొదటి చిత్రం ‘మౌన పోరాటం’లో నేనే హీరో, నేనే విలన్. 35 ఏళ్లుగా 150 సినిమాల్లో నటించాను. చాలా గ్యాప్ తర్వాత ‘స్ట్రీట్ లైట్’లో ‘మౌన పోరాటం’ వంటి షేడ్స్ ఉన్న పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. ఓటీటీ ఆఫర్స్ వచ్చినా సేవ్ థియేటర్స్ అంటూ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు మామిడాల శ్రీనివాస్.