యూర‌ప్ వీధుల్లో ‘అర్జున్‌రెడ్డి’ | Actor Vijay Deverakonda Takes A Personal Trip To Europe | Sakshi
Sakshi News home page

విజ‌య్ యూర‌ప్ ట్రిప్ ఫోటోలు వైర‌ల్

Oct 5 2020 9:35 AM | Updated on Oct 5 2020 11:45 AM

Actor Vijay Deverakonda Takes A Personal Trip To Europe - Sakshi

లండన్‌: ఏమాత్రం ఖాళీ స‌మ‌యం దొరికినా మ‌న స్టార్స్ విదేశాల‌కు చెక్కేస్తుంటారు. న‌టుడు విజ‌య్‌ దేవ‌ర‌కొండ సైతం ప్ర‌స్తుతం యూర‌ప్ వీధుల్లో చెక్క‌ర్లు కొడుతున్నారు. ప‌ని ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ అయ్యేందుకు యూర‌ప్ వెళ్లిపోయాడు ‘అర్జున్‌రెడ్డి’. క్యాజువ‌ల్ లెనిన్ షర్ట్‌, లాంగ్ హేయిర్‌తో సూప‌ర్ స్టైలిష్‌గా ఉన్న విజ‌య్ చాలా ఉల్లాసంగా క‌నిపిస్తున్నారు. విజ‌య్ న్యూలుక్‌కి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ప‌ని ఒత్తిడి, న‌టుడిగా సాధార‌ణంగా క‌లిగే అసౌక‌ర్యాల నుంచి త‌ప్పించుకునేందుకు, మ‌రీ ముఖ్యంగా అక్క‌డ దొరికే అద్భుత‌మైన ఆహారం కోసం యూర‌ప్‌కు వెళ్లిన‌ట్లు విజ‌య్ పేర్కొన్నాడు. (టైమ్స్‌ నౌ జాబితాలో టాలీవుడ్‌ నుంచి ఒకే ఒక్కడు!)

ఇక జీనియన్‌ డైరెక్టర్‌ సుకుమార్ డెరెక్ష‌న్‌లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్న‌ట్లు ఇటీవల అధికార ప్రకటన వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఫాల్క‌న్ క్రియేష‌న్స్ ప‌తాకంపై నిర్మించనున్న ఈ చిత్రం 2022లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక విజయ్‌దేవర కొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్‌’ సినిమాలో నటిస్తుండగా.. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప’ మూవీతో సుక్కు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. (అఫీషియల్‌‌: సు​కుమార్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement