రెండో పెళ్లిపై స్పందించిన సుమంత్‌ | Actor Sumanth Shocking Clarity On His Second Marriage | Sakshi
Sakshi News home page

రెండో పెళ్లిపై స్పందించిన సుమంత్‌

Jul 29 2021 7:39 PM | Updated on Jul 29 2021 7:57 PM

Actor Sumanth Shocking Clarity On His Second Marriage - Sakshi

అక్కినేని హీరో సుమంత్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. సుమంత్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే యువతితో ఆయన వివాహం జరగబోతుందని, ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారని పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ వదంతులపై హీరో సుమంత్‌ స్పందించాడు. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని, అవన్ని వట్టి రూమర్లే అని కొట్టిపడేశాడు.

రియల్‌ లైఫ్‌లో తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని, వైరల్‌ అయిన వెడ్డింగ్‌ కార్డు తన తదుపరి సినిమాకి సంబంధించినది అని క్లారిటీ ఇచ్చేశాడు. పెళ్లి, విడాకులకు సంబంధించి ఓ సినిమా చేస్తున్నానని, ఆ ఫిల్మ్‌ షూట్‌ నుంచి ఒక పెళ్లి కార్డు ఫోటో లీకైందని చెప్పారు. ఆ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని త్వరలోనే విడుదల చేస్తామని సుమంత్‌ చెప్పాడు. ప్రస్తుతం సుమంత్‌ ‘అనగనగా ఒక రౌడీ’లోచిత్రంలో నటిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement