Actor Sarath Babu Was Admitted to the Hospital Due to Illness - Sakshi
Sakshi News home page

Sarath Babu : తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నటుడు శరత్‌బాబు

Apr 22 2023 2:57 PM | Updated on Apr 22 2023 3:06 PM

Actor Sarath Babu Was Admitted to the Hospital Due to Illness - Sakshi

ప్రముఖ నటుడు శరత్‌బాబు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బెంగళూరులో చికిత్స పొందిన ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం శరత్‌బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూ నుంచి జనరల్‌ రూంకు షిఫ్ట్‌ చేశామని వైద్యులు తెలిపారు.



కాగా 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమల్లో 200కి పైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలతో అలరించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement