విడాకులు.. మగవాళ్లదే తప్పు కాదు, నా భార్య ఏం చేసిందో..! | Actor Sanjay Bhargav Reveals About His Marriage And Divorce, Deets Inside - Sakshi
Sakshi News home page

మొదటి భార్యకు విడాకులు.. నా గురించి నీచంగా మాట్లాడారు: నటుడు

Mar 31 2024 6:40 PM | Updated on Mar 31 2024 8:20 PM

Actor Sanjay Bhargav About His Marriage and Divorce - Sakshi

నా భార్యకు విడాకులిచ్చినప్పుడు చెన్నైలో ఉన్నాను. చాలామంది.. నీకు ఎవరితోనైనా ఎఫైర్‌ ఉందా? అందుకనే విడాకులు తీసుకున్నావా? అని పిచ్చి ప్రశ్నలు వేశారు. ఇండస్ట్రీ

ఒకప్పుడు హీరోగా సినిమాలు చేశాడు కన్నడబ్బాయి ప్రశాంత్‌. తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 40 చిత్రాల్లో నటించాడు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అతడికి సంజయ్‌ భార్గవ్‌ అనే స్క్రీన్‌ నేమ్‌ సూచించడంతో ఆ పేరుతోనే కంటిన్యూ అయ్యాడు. అతడి తల్లి భరతనాట్య కళాకారిణి. అలా చిన్నప్పటినుంచే క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకున్నాడు.

పిల్లల మనసు పాడు చేయొద్దు
తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చాడు. 'పెళ్లయిన కొంతకాలానికే విడిపోతున్నారు. కానీ పిల్లలున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. భార్యాభర్తల మధ్య ఏదున్నా అది వారి మధ్యే ఉండాలి. పిల్లల మనసును పాడుచేయకూడదు. నా విషయంలో ఇదే జరిగింది. ఎవరైనా విడిపోయారనగానే మగవాడిదే తప్పంటారు. మహిళా శక్తి అంటూ ఆడవాళ్లకు సపోర్ట్‌ చేస్తారు. ఇద్దరినీ సమానంగా చూడాలి. 

ఎఫైర్‌ ఉందా? అని చెడుగా..
ముఖ్యంగా పిల్లల మనసు కలుషితం చేయకూడదు. నేను నా భార్యకు విడాకులిచ్చినప్పుడు చెన్నైలో ఉన్నాను. చాలామంది.. నీకు ఎవరితోనైనా ఎఫైర్‌ ఉందా? అందుకనే విడాకులు తీసుకున్నావా? అని పిచ్చి ప్రశ్నలు వేశారు. ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన నేను చెడిపోయినట్లేనా? ఆ మాటలు విన్నప్పుడు బాధేస్తుంది. నా పిల్లలు మాజీ భార్య దగ్గరే ఉంటారు. వారికి ఆర్థికంగా సాయం చేస్తుంటాను. అయినా సరే వాళ్లు నన్ను కలవడానికి, మాట్లాడటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపరు.

రెండో పెళ్లి
నా మాజీ భార్య ఏం చేసిందో నాకు తెలుసు. అది నేను బయటకు చెప్పలేను. ఇప్పుడైతే నా పిల్లలు సెటిలయ్యారు. 2016లో నేను విడాకులు తీసుకున్నాను. రెండో పెళ్లి జోలికి వెళ్లకూడదనుకున్నాను. డ్యాన్స్‌ ‍ప్రోగ్రామ్స్‌ ద్వారా హేమను కలుసుకున్నాను. 2017లో మేము పెళ్లి చేసుకున్నాం. ఆ మరుసటి ఏడాదే కూతురు పుట్టింది. ఇప్పటివరకు సినిమాలు చేశాను, సీరియల్స్‌ చేశాను. ఓటీటీలో కూడా చేయాలనుంది' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌కు అమ్మ నగలు గిఫ్టిచ్చేవాడిని.. పెళ్లిలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement