కరోనా నుంచి కోలుకుంటున్న రాజశేఖర్‌

Actor Rajasekhar Recovering From Covid Released Health Bulletin - Sakshi

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రాజశేఖర్ ఆరోగ్యం మెల్లమెల్లగా కుదుటపడుతోంది. తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను కూతురు శివాత్మిక ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం రాజశేఖర్‌ ఆరోగ్యం బాగుందని, కరోనా నుంచి కోలుకుంటున్నట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రి బృందం తన తండ్రి ఆరోగ్యం కుదుటపడటానికి ఎంతో కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సిటీ న్యూరో ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ను శివాత్మిక షేర్ చేశారు. చదవండి: నిల‌క‌డ‌గా హీరో రాజశేఖర్ ఆరోగ్యం

'రాజశేఖర్ కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోంది. వైద్యుల బృందం నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తోంది. హై ఫ్లో ఆక్సిజన్‌ను ఆయనకు అందిస్తున్నాం' అని బులెటిన్ లో డాక్టర్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల రాజశేఖర్‌ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే జీవితా, ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి బయటపడినప్పటికీ రాజశేఖర్‌ మాత్రం ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చదవండి: హనీమూన్‌ వాయిదా వేసుకున్న కాజల్‌..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top