బర్త్‌ డే పార్టీలో డ్రగ్స్‌ వినియోగం.. బాలీవుడ్‌ నటి అరెస్ట్‌

Actor Nehal Shah Her Friend Arrested Under NDPS Act - Sakshi

ముంబై: బాలీవుడ్‌ యువ నటి నైరా నేహాల్‌ షాతోపాటు ఆమె  స్నేహితుడు అశిక్‌ సాజిద్‌ హుస్సేన్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖరీదైన హోటల్‌లో నటి తన స్నేహితులతో కలిసి జరుపుకున్న బర్త్‌డే పార్టీలో మాదక ద్రవ్యాలు ఉపయోగించారన్న ఆరోపణలతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. పార్టీ నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శాంతాక్రూజ్‌ పోలీసుల ప్రకారం.. జుహులోని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో నటి నేహాల్‌ షా తన బర్త్‌ డే సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చింది.

ఈ వేడుకకు గోవాకు చెందిన తన స్నేహితుడు ఆశిక్ హుస్సేన్ హాజరయ్యాడు. వీరిద్దరూ డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో తెల్లవారుజామున 3.30 నిమిషాల సమయంలో హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన నటి నైరా, ఆమె స్నేహితుడు ఆశిక్‌ ఇద్దరూ చారస్‌ తినేవారని పోలీసులు గుర్తించారు. పశ్చిమ అంధేరిలోని కూపర్ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షలో ఇద్దరూ పాజిటివ్ పరీక్షలు చేయించుకున్న తరువాత వీరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

వీరిద్దరిని కోర్టులో హాజరుపర్చగా ఇద్దరికీ బెయిల్ లభించిందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంపై విచారణ జరుపుతున్నారు. అలాగే వీరికి మాదకద్రవ్యాల్ని సరఫరా చేసిన వారికి కోసం గాలిస్తున్నారు. నేహాల్‌ షా పలు బాలీవుడ్‌ చిత్రలతో పాటు రెండు తెలుగు చిత్రాల్లోనూ నటించింది.

చదవండి: 
ఒంటినిండా బురదతో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
Sushant Singh: ఆ నవ్వులు చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top