Arjun Sarja Mother Passed Away Actor Arjun Sarja Mother Lakshmidevamma Passed Away At 85 - Sakshi
Sakshi News home page

Arjun Sarja: నటుడు అర్జున్‌ ఇంట తీవ్ర విషాదం

Jul 23 2022 12:53 PM | Updated on Jul 23 2022 1:48 PM

Actor Arjun Sarja Mother Lakshmidevamma Passed Away At 85 - Sakshi

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి లక్ష్మి దేవమ్మ(85) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. తల్లి మరణంతో హీరో అర్జున్‌ ఇంట ఒక్కసారిగా విషాద చాయలు నెలకొన్నాయి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపుడుతున్న ఆమె శనివారం(జూలై 23న) బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

ప్రస్తుతం ఆమె పార్థివ దేహం ఆస్పత్రిలోనే ఉన్నట్లు సమాచారం. కాగా లక్ష్మి దేవమ్మ మృతి పట్ల కన్నడ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ అర్జున్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కాగా లక్ష్మి దేవమ్మ మైసూర్‌లో స్కూల్‌ టీచర్‌గా పనిచేశారు. 

చదవండి: 
నేనింకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం వారే: హీరోయిన్‌
సూర్య సినిమాకు జాతీయ అవార్డుల పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement