అజిత్‌ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు : నిర్మాత | Actor And Producer Rk Suresh About Ajith | Sakshi
Sakshi News home page

అజిత్‌ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు : నిర్మాత

Mar 15 2022 8:37 AM | Updated on Mar 15 2022 10:28 AM

Actor And Producer Rk Suresh About Ajith - Sakshi

నటుడు అజిత్‌ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని నటుడు, నిర్మాత ఆర్కే సురేష్‌ అన్నారు. ఆదివారం చెన్నైలో మాయన్‌ చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఉండేవారే ఇక్కడి వారిని విమర్శిస్తున్నారని, అజిత్‌ నటించిన వలిమై చిత్రం గురించి కొందరు తీవ్రంగా విమర్శలు చేశారన్నారు. తప్పులను ఎత్తి చూపించవచ్చని, నటుడు అజిత్‌ గురించి మాట్లాడే అర్హత వారెవరికీ లేదన్నారు.

సోషియే ఫాంటసీ కథా చిత్రంగా రూపొందిన మాయాన్‌ చిత్రాన్ని చూసి రాజమౌళి చిత్ర దర్శకుడు రాజేష్‌ను అభినందించారని అన్నారు. ఈ సినిమాను తమిళనాడుకు చెందిన మలేషియా వాసి డత్తో గణేష్‌ నిర్మింస్తుండగా రాజేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వినోద్‌ మోహన్, బిందు మాధవి, ప్రియా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.  గూగుల్‌ కుట్టప్ప ట్రైలర్‌ ఆవిష్కరణలో సురేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement