అంబులెన్స్ సేవలు ప్రారంభించిన ఆదిత్య ఓం | Sakshi
Sakshi News home page

అంబులెన్స్ సేవలు ప్రారంభించిన ఆదిత్య ఓం

Published Tue, Nov 1 2022 7:20 PM

Actor Aditya Om Started Ambulance Services - Sakshi

 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకుంటున్న ఆదిత్య ఓం సేవారంగంలో తన ఔదార్యాన్ని చాటుతున్నాడు. పలు సేవా కార్యక్రమాలు ద్వారా ఆయన ఇప్పటికే ఎంతో మందికి  పేదవాళ్లకు సహాయం చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుపల్లి లోని ఐదు గ్రామాలను దత్తత తీసుకుని దాదాపు 500 మంది కి సహాయం చేసిన ఆదిత్య ఓం తాజాగా కొత్తగూడెం జిల్లా మరియు తాండూరులోని చెరుపల్లి, కొత్తపల్లి మరియు పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సేవలను అందించడానికి తన వంతు కృషి చేశారు.

అక్కడి గిరిజన గ్రామాల్లో చాలా కాలంగా పనిచేస్తున్న ఆదిత్య ఓం కోవిడ్ సమయంలో అంబులెన్స్ సేవలు లేకపోవడం మరియు ఆ ప్రాంతంలో  పాము కాటు కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చూసి చలించారు. దాంతో అక్కడ పేరుగాంచిన  రోటరీ క్లబ్, దానికి సంబంధించిన స్థానిక సంస్థల ఆర్థిక సహాయంతో ఈ ప్రాంతాలకు అంబులెన్స్ సేవలు అందించగలిగారు. తన స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలు అందించిన సహాయం మరియు స్థానిక ప్రజల అవగాహన కారణంగా ఇది సాధ్యం అయ్యింది ఆదిత్య ఓం అన్నారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement