‘ఆచార్య’ టీంకు భారీ షాక్‌, మెగాస్టార్‌కు సైతం అదే బెడదా

Acharya Movie: Ram Charan And Pooja Hegde Song Leaked  - Sakshi

స్టార్‌ హీరోల సినిమాలకు క్రేజ్‌ ఎక్కువ. అందుకే ఆ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకుకోనేందుకు లీక్‌ వీరు కాచుకుర్చుంటున్నారు. ఏమాత్రం ఛాన్స్‌ దొరికిన సినిమాల మేకింగ్‌ నుంచి విడుదల వరకు కీలక పాత్రలను, సన్నివేశాలను, కంటెంట్‌ను లీక్‌ చేసేస్తున్నారు. ఇక స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చినప్పటి నుంచి లీకు వీరులకు పని మరింత ఈజీ ఆయిపోయింది. దీంతో స్టార్‌ హీరోలకు, దర్శక-నిర్మాతలకు లీకేజీలు తల నొప్పిగా మరాయి. బాహుబలి నుంచి వకీల్‌ సాబ్‌ వరకు ఎన్నో చిత్రాలకు ఈ బెడదా తప్పలేదు.

తాజాగా మెగాస్టార్‌ మూవీకి సైతం లీక్‌ దెబ్బ తాకింది. దర్శకుడు కొరటాల శివ ఆచార్య మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కీలక పాత్రలో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ మూవీ మేకింగ్‌ విషయంతో కొరటాల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఓ పాట విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో రోమాంటిక్‌ సాంగ్‌ హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ పాట సోషల్‌ మీడియాలో మారుమోగడం చూసి ‘ఆచార్య’ టీం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎందుకంటే ఈ పాటను చిత్ర బృందం కాకుండా లీక్‌ వీరులు లీక్‌ చేశారు.

కాగా ఇందులో రామ్‌ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే వీళ్లిద్దరిపై కొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఇందులో పూజా పాత్ర పేరు నీలాంబరి అని ఇంతకుముందే చిత్ర బృందం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ పేరు మీదే పాటను తీర్చిదిద్దారు. ఆ నీలాంబరి పాటే ఇప్పుడు ఆన్ లైన్లో లీక్ అయిపోయింది. ఎవరు, ఎలా లీక్ చేశారన్నది మాత్రం తెలియదు కానీ.. నీలాంబరి అంటూ సాగే ఈ పాట చాలా బాగుందంటు కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాటికి ‘ఆచార్య’ సినిమాలో చరణ్, పూజా హెగ్డే షూటింగ్ అయిపోవాల్సింది కానీ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణకు బ్రేక్ పడింది.

చదవండి: 
మెగాస్టార్‌ రికార్డును బద్దలు కొట్టిన బాలయ్య

కరోనా దెబ్బకు వెనకడుగు వేస్తున్న మెగాస్టార్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top