Aamir Khan: మేకప్‌ ఆర్టిస్ట్‌గా మారిన బాలీవుడ్‌ స్టార్‌, ఎవరికోసమో తెలుసా?

Aamir Khan Turned Makeup Artist For Daughter Ira Khan Pics Goes Viral, See Fans Reaction - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ మేకప్‌మెన్‌గా మారిపోయాడు. ఎందుకు? ఎవరికోసం? అనుకుంటున్నారా? తన ముద్దుల కూతురు ఇరా కోసం! ఈ విషయాన్ని స్వయంగా ఇరానే వెల్లడించింది. 'నాకు మేకప్‌ ఎవరు వేశారో తెలుసా? ఇంకెవరు మా నాన్నే. నాకంటే బాగా మేకప్‌ వేస్తానని చెప్పాడు. చివరకు ఆ మాటను నిజం చేసి చూపించాడు. ఎవరికైనా యూట్యూబ్‌ ట్యుటోరియల్స్‌ కావాలా?' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రితో దిగిన ఫొటోలను పోస్ట్‌ చేసింది.

ఆమిర్‌ తన ముఖానికి మేకప్‌ వేస్తే ఇరా మాత్రం ఆమిర్‌ తలకు హెయిర్‌ బ్యాండ్‌ పెట్టి నవ్వేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీరి అనుబంధాన్ని చూసిన ఫ్యాన్స్‌ ఆమిర్‌ ఉత్తమ తండ్రి, లవ్‌ యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమిర్‌ నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్‌ చద్దా'. ఫారెస్ట్‌ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో కరీనా కపూర్‌, నాగచైత్య, అద్వైత్‌ చందన్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

చదవండి: 'నువ్వు యాక్టరేంటి? నిన్ను తీసుకుంటే మాకన్నీ నష్టాలే'

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top