'రుధిరాక్ష' కోసం ఏకమైన ఆది సాయికుమార్‌, జేడీ చక్రవర్తి

Aadi Sai Kumar Rudraksha Movie Shooting Started - Sakshi

ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు ఆది సాయికుమార్‌. తాజాగా ఈ యంగ్‌ హీరో మరో కొత్త సినిమా ‘రుధిరాక్ష’ను కూడా పట్టాలెక్కించాడు. ఇందులో వెర్సటైల్ యాక్టర్స్ జె.డి చక్రవర్తి, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 9 స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. 

 డార్క్, థ్రిల్లర్ నేపధ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబధించిన పూజా కార్యక్రమం రామానాయడు స్టూడియోలో ఘనంగా జరిగింది.  ముహూర్తపు సన్నివేశానికి సముద్రఖని క్లాప్ కొట్టగా రామ్ తాళ్లూరి కెమరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ కు డైరెక్టర్ దేవ్ దర్శకత్వం వహించారు. 

హై బడ్జెట్, టాప్ టెక్నికల్ వాల్యూస్ తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. 'యానిమల్' ఫేం హర్షవర్షన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కిశోర్ బోయిదాపు డీవోపీ గా పని చేస్తున్న ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆర్ట్ డైరెక్టర్. పవన్ హిమాన్షు, బాలు మహేంద్ర మాటలు అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top