హీరో ఆది సాయికుమార్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ | Aadi Sai Kumar Birthday Celebration With Tees Maar Khan Movie Team | Sakshi
Sakshi News home page

Aadi Sai Kumar: తీస్‌ మార్‌ ఖాన్‌ టీమ్‌తో ఆది సాయి కుమార్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌

Dec 24 2021 9:06 PM | Updated on Dec 24 2021 9:06 PM

Aadi Sai Kumar Birthday Celebration With Tees Maar Khan Movie Team - Sakshi

ఈ నేపథ్యంలో 'తీస్ మార్ ఖాన్' నిర్మాత తమ విజ‌న్ సినిమాస్ ఆఫీసులో ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు...

'ప్రేమ కావాలి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది సాయి కుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ భారీ పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ప్రేమ కావాలి సినిమాకు బెస్ట్ డెబ్యూ మేల్ యాక్టర్‌గా అవార్డు అందుకున్న ఆయన ఆ తర్వాత వరుస ఆఫర్స్ పట్టేస్తూ విలక్షణ కథలతో అలరిస్తున్నారు. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను కూడగట్టుకున్న ఈ హీరో మరికొద్ది రోజుల్లో 'తీస్ మార్ ఖాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ నేపథ్యంలో 'తీస్ మార్ ఖాన్' నిర్మాత తమ విజ‌న్ సినిమాస్ ఆఫీసులో ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 'తీస్ మార్ ఖాన్' దర్శకనిర్మాతలు నాగం తిరుప‌తి రెడ్డి, కళ్యాణ్ జి గోగణ.. ఆది సాయి కుమార్‌కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ యాక్షన్ ప్యాక్డ్ మూవీ 'తీస్ మార్ ఖాన్' ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతకు కృతజ్ఞతలు చెప్పిన ఆది సాయి కుమార్.. ముందు ముందు మరిన్ని వినూత్న కథలతో అలరిస్తానని అన్నారు.  

ఇక 'తీస్ మార్ ఖాన్' సినిమా విషయానికొస్తే.. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. 'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. RX 100 సినిమాతో యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లాన్స్ ఆది సాయి కుమార్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement