అందుకే ఈ సినిమా సూపర్‌ హిట్‌

Aadavallu Meeku Johaarlu Pre Release Event  - Sakshi

– సుకుమార్‌ 

‘‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చూసి సినిమా అదిరిపోయిందని దేవిశ్రీ చెప్పాడు.. తన జడ్జిమెంట్‌పై నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే ఈ సినిమా సూపర్‌ హిట్‌ అని ఇప్పుడే చెబుతున్నా’’అని డైరెక్టర్‌ సుకుమార్‌ అన్నారు. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 4న విడుదలకానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో సుకుమార్‌ మాట్లాడుతూ–‘‘సమంత, కీర్తీ సురేశ్, సాయిపల్లవి, రష్మికలు అందమైన, మంచి నటన కనబరుస్తున్నారు. సాయిపల్లవి మంచే నటే కాదు.. తనకు మంచి మనసు కూడా ఉంది. కిషోర్‌ చాలా సున్నితమైన మనసు ఉన్నవాడు.. ఈ సినిమాతో చాలా పెద్ద సక్సెస్‌ రావాలి. శర్వానంద్‌కి నేను పెద్ద అభిమానిని. తన గత రెండు సినిమాలు కొంచెం సీరియస్‌గా ఉన్నా ఈ సినిమా మాత్రం సరదాగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీతో సుధాకర్‌గారికి పెద్ద హిట్‌ రావాలి. కుష్బూగారిని ఒక రోజు డైరెక్ట్‌ చేసే అవకాశం రావడం సంతోషం.. ఆమె ముందు నేను స్టూడెంట్‌ని అయిపోయాను’’ అన్నారు.

కీర్తీ సురేశ్‌ మాట్లాడుతూ–‘‘కిశోర్‌గారి ‘నేను శైలజ’ చిత్రంతో తెలుగులో నా ప్రయాణం ప్రారంభమైంది. పంచ్‌లు, డైలాగులు చూస్తే ఇది ఆయన సినిమా అని తెలుస్తుంది. రష్మిక ప్రతిభ గురించి నేను చెప్పేదేముంది.. కెరీర్‌ బిగినింగ్‌ నుంచే నువ్వు(రష్మిక) తగ్గేదే లే. మీరంతా హాయిగా థియేటర్లకు వెళ్లి ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చూసి, ఎంజాయ్‌ చేయండి’’ అన్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ– ‘‘శర్వానంద్‌గారితో నేను ఓ ఫ్రెండ్‌లా మాట్లాడేస్తాను. మంచి కథల కోసం ఆయన ఎప్పుడూ తాపత్రయ పడుతుంటారు. ‘పడి పడి లేచే మనసు’ చిత్రంలో శర్వానంద్‌తో కలిసి నటించడాన్ని గౌరవంగా ఫీల్‌ అవుతున్నాను. ‘ఆడవాళ్ళు..’ ట్రైలర్‌ బాగుంది.  రష్మిక కెరీర్‌లో ఈ సినిమా మరో హిట్‌గా చేరాలి.

ఈ సినిమా చుట్టూ ఓ పాజిటివ్‌ వైబ్‌ కనిపిస్తోంది. నిర్మాతలకు పెద్ద సక్సెస్‌ రావాలి’’ అన్నారు. ‘‘ఈ వేడుకను జీవితంలో ఎప్పుడూ మరచిపోలేను. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడండి.. మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు కిషోర్‌ తిరుమల. శర్వానంద్‌ మాట్లాడుతూ–‘‘సుకుమార్‌గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్‌. ఆయన, కీర్తీ సురేశ్‌గారు ఈ వేడుకకి రావడం సంతోషంగా ఉంది. సాయిపల్లవి మనసుతో చూస్తుంది.. మనసుతో మాట్లాడుతుంది.. అందుకే ఇంతమంది అభిమానం సొంతం చేసుకుంది. మా సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ ప్రాణం పోశారు.. బ్లాక్‌ బస్టర్‌ పాటలిచ్చినందుకు థ్యాంక్స్‌.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ నా కెరీర్‌లో బెస్ట్‌ సినిమాగా నిలిచిపోతుంది.. రాసి పెట్టుకోండి’’ అన్నారు. ‘‘చాలా కాలం తర్వాత వస్తున్న క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. అందరూ ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతల్లో ఒకరైన శ్రీకాంత్‌ అన్నారు. రష్మికా మందన్నా మాట్లాడుతూ – ‘‘శర్వానంద్‌ని ఎంత విసిగించినా చాలా కూల్‌గా ఉంటాడు. ఈ సినిమాలో చాలామంది ఆడవాళ్ళు యాక్ట్‌ చేశారు. ప్రతి క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉంటుంది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వెంకట్‌ బోయనపల్లి, సూర్యదేవర నాగవంశీ, చిత్ర కెమెరామేన్‌ సుజిత్‌ సారంగ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటీమణులు కుష్బు, రజిత, ఝాన్సీ, డైరెక్టర్‌ వేణు ఊడుగుల, కెమెరామేన్‌ సత్యన్‌ సూర్యన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top