111 జీవో నేపథ్యంలో...

111 Movie Based On Contemporary Social Issues - Sakshi

ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన జీవో 111 నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం ‘111’. వీఆర్‌ దర్శకత్వం వహించనున్నారు. సురేష్‌ కొండేటి సమర్పణలో వై. రఘునాథరెడ్డి, స్నేహలత ఈ సినిమాని నిర్మించనున్నారు. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రాజకీయ రాక్షస క్రీడలో రైతులు బలవుతున్నారు.  మెతుకునిచ్చి బతుకులు పండించే పచ్చని పల్లెలు కాంక్రీట్‌ సౌధాలకు సమాధులవుతున్నాయి.

జీవోలను అడ్డుపెట్టుకుని నాయకులు, వారి తొత్తులు చేసే దురాగతాలపై ఓ యువకుని తిరుగుబాటు ఫలితమే ఈ ‘111’. హైదరాబాద్‌ శివారులో జీవో 111 పరిధిలో ఉన్న ఓ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రభుత్వ జీవోలు ప్రజల మెరుగైన జీవన విధానానికి బలమైన ఆయుధాలవ్వాలని చెప్పే చిత్రమిది. మంచి మేకింగ్‌ విలువలు, మంచి నటులు, విప్లవాత్మక కథతో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్‌  మురారి, సంగీతం: లెండర్‌ లీ మార్టి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top