మా పిల్లలను ఉన్నత చదువులు చదివించి, మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆశతో అగ్రిగోల్డ్‌లో డబ్బులు పెట్టాం. ఇద్దరం కంపెనీలో పనిచేసి ఏళ్ల తరబడి ఇద్దరి పేర్లపై చీటీలు కట్టాం. తిన్నా తినకున్నా నెలనెలా చీటీలు కడితే తీరా సంస్థ బోర్డు తిప్పేయడంతో గుండెలవిసేలా రోదించాం. ఇప్పుడు మా డబ్బులు ఇస్తున్నారని తెలిసి వచ్చాం.
– పద్మా, రాములు దంపతులు, సంగారెడ్డి
షెడ్యూల్ ప్రకారం రావాలి
అగ్రిగోల్డ్ బాధితులు ఆయా జిల్లాలకు కేటాయించిన తేదీల్లో మీ వద్ద ఉన్న బాండ్లు, చీటీ కట్టిన రశీదులు, ఇతర పేపర్లను తీసుకొని ఎస్పీ కార్యాలయానికి రావాలి. డిసెంబర్ 15 వరకు మెదక్ జిల్లా, 15 నుంచి జనవరి 23 వరకు సంగారెడ్డి, 23 నుంచి ఫిబ్రవరి 10 వరకు సిద్దిపేటకు సంబంధించిన బాధితుల నుంచి ఆధారాలు సేకరిస్తాం.
– శ్రీనివాసరావు, ఎస్పీ


