తాగునీటి కొరత రానియొద్దు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి కొరత రానియొద్దు

Nov 26 2026 12:21 PM | Updated on Nov 26 2026 12:21 PM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది జూన్‌, జూలై వరకు కొనసాగే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో నీటి లభ్యతపై ఇప్పటి నుంచే ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట నూతన బోర్లు వేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రారంభించిన పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. విద్యార్థులో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, ప్రతిభను వెలికితీయాలన్నారు. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమ, మిషన్‌ భగీరథ డీఈ నాగభూషణం, డీఐఈఓ ప్రభావతి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సింధు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఖేలో ఇండియా సెల్ఫీ పాయింట్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఖేలో ఇండియా క్రీడా పోటీలపై క్రీడాకారులకు అవగాహన కల్పించి ఎక్కువ మంది క్రీడల్లో పాల్గొనేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement