@ 73968 50955
● ఆలయ సమాచారం కోసం ఫోన్ నంబర్
వర్గల్(గజ్వేల్): రాష్ట్రంలో రెండో యాదాద్రిగా పేరొందిన నాచారం గుట్ట లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం విశేష భక్తజనాదరణ కలిగిన భవ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో ఆలయ సమాచారం కోసం యాత్రికులకు ఉపయుక్తంగా ఫోన్ నంబర్ 73968 50955తో సమాచార కేంద్రం ఏర్పాటుచేశారు. క్షేత్రంలో పూజలు, అర్చనలు, మొక్కుబడి సేవలు, సత్రాలు తదితర ఆలయ సంబంధ సమాచారాన్ని ఈ నంబర్‌కు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చని కార్యనిర్వహణాధికారి బెల్లంకొండ రంగాచారి పేర్కొన్నారు. యాత్రికుల సౌకర్యార్థం ఈ నంబర్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


