మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని, కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో పలు శాఖల అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లను సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొ నుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ నిత్యానంద్, సివిల్ సప్లయ్ డీఎం జగదీశ్, డీఆర్డీఓపీడీ శ్రీనివాసరావు, డీసీఓ పద్మ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్


