పండుగ వేళ ధరల మంట | - | Sakshi
Sakshi News home page

పండుగ వేళ ధరల మంట

Oct 21 2026 8:08 AM | Updated on Oct 21 2026 8:08 AM

సన్నబియ్యం ధరలకు రెక్కలు

వంటింటి బడ్జెట్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్‌

దసరా పండుగ వేళ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయి. ముఖ్యంగా సన్నబియ్యం గడిచిన వారం రోజుల్లోనే క్వింటాల్‌పై రూ. 2 వేల చొప్పున పెరిగింది. అదేబాటలో పప్పులు, చక్కెర, ఆయిల్‌, ఉల్లిపాయలు ఇతరత్ర కిరాణా వస్తువులు ఉన్నాయి. దీంతో పేద, మధ్య తరగతిపై భారం పెరుగుతోంది. – మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా 2011 జానాభా లెక్కల ప్రకారం 7.25 లక్షల మంది ఉన్నారు. ప్రజల ప్రధాన ఆహారం అన్నం కావటంతో బియ్యం ఎక్కువగా అవసరం ఉంటుంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సరైనా వర్షాలు కురవక చెరువులు, కుంటలు నిండలేదు. ఈ క్రమంలోనే బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. 10 రోజుల క్రితం సన్నబియ్యం క్వింటాల్‌కు రూ. 6,200 నుంచి రూ.7 వేల వరకు ఉండగా, ప్రస్తుతం క్వింటాల్‌కు రూ. 7,800 నుంచి మొదలుకుని రూ. 8,200కు పెరిగింది. ఈ లెక్కన క్వింటాల్‌పై సుమారు రూ. 2 వేలు పెరిగింది. అవి కూడా రారైస్‌ కాదు. బాయిల్డ్‌ మిల్లులో మరాడించిన స్టీమ్‌ రైస్‌ కావటం గమనార్హం. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే మున్ముందు మరింతగా బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సన్న బియ్యం నిల్వ

ఎల్‌నినో ప్రభావంతో మున్ముందు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు సన్న బియ్యం నిల్వలు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 3.40 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా, అందులో 3 లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి పండించారు. అందులోనూ సన్న సింహభాగం వరి సాగు చేశారు. ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్‌పై రూ.500 బోనస్‌ అందనుంది. అయితే ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.3,200 చొప్పున నగదు రూపంలో చెల్లించి పచ్చి వడ్లను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు ఈ ఏడాది పండిన సన్న ధాన్యాన్ని బియ్యం పట్టించి నిల్వ ఉంచుకునే పరిస్థితి జిల్లాలో అధికంగా కనిపిస్తుంది.

క్వింటాల్‌పై రూ.2 వేలు పెరుగుదల

అదే బాటలో పప్పులు, చక్కెర

పేద, మధ్య తరగతి కుటుంబాల బెంబేలు

అదే విధంగా పప్పులు, చక్కెర, ఆయిల్‌ ధరలు సైతం అమాంతం పెరిగాయి. వారం రోజుల క్రితం కిలో కంది పప్పు ధర రూ. 110 ఉండగా, ప్రస్తుతం అది రూ. 150కి చేరుకుంది. పెసర, మినుప, శనగ తదితర పప్పులు కిలోపై రూ. 20 నుంచి రూ.35కు పెరిగింది. అలాగే కిలో చక్కెర ధర ఆగస్టులో రూ. 45 ఉండగా, సెప్టెంబర్‌లో ఏకంగా కిలో రూ.70కి పెంచేశారు. అంటే కిలోపై రూ. 25 పెరిగింది. ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో ప్రస్తుతం కిలోకు రూ. 55 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే కిలో ఉల్లిగడ్డ రూ. 70 చొప్పున విక్రయిస్తుండగా, లీటర్‌ ఆయిల్‌ రూ.165 నుంచి రూ. 170 చొప్పున అమ్ముతున్నారు. మొన్నటి వరకు యుద్ధంతో ధరలు పెరుగుతున్నాయని చెప్పిన వ్యాపారులు, నే డు ఎల్‌నినో కారణంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement