బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతీ అమ్మవారిని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు సోమవారం దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దర్శనానికి వచ్చిన ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాలాలయంలో పూజల అనంతరం సరస్వతీ దేవిని దర్శించుకున్నారు.
మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారా మెడికల్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నితిన్‌కుమార్ కబ్రా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి పారా మెడికల్ రెండేళ్ల కోర్సులో (డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్, డీఎంఎల్టీ, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డెన్ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


