దుర్గాదేవిగా అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

దుర్గాదేవిగా అమ్మవారు

Oct 19 2026 7:47 AM | Updated on Oct 19 2026 7:47 AM

దుర్గాదేవిగా అమ్మవారు పంటలు ఎండకుండా చర్యలు ప్రభుత్వం కార్మికుల పక్షమే..

పాపన్నపేట(మెదక్‌): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లోభాగంగా ఏడుపాయల దుర్గమ్మ ఆదివారం దుర్గాదేవి(మహాగౌరి) అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈఓ వీరేశం ఏర్పాట్లు చేశారు.

కొల్చారం(నర్సాపూర్‌): విద్యుత్‌ సమస్యలతో రైతుల పంటలు ఎండిపోకుండా తక్షణ చర్యలు చేపడుతున్నామని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నారాయణ నాయక్‌ తెలిపారు. ఆదివారం మండలంలో ఆయన పర్యటించారు. చిన్నఘనాపూర్‌ 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను సందర్శించి క్షేత్రస్థాయిలో సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా పరిస్థితులను అంచనా వేసేందుకు వరి గుంతం క్రిటికల్‌ ఫీడర్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌, బోర్‌వెల్‌ స్టార్టర్‌ పాయింట్ల వద్ద ఓల్టేజీలు తనిఖీ చేశారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి విద్యుత్‌ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల బోర్లు వాటి సామర్థ్యంపై ఆరా తీశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని క్షేత్ర సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఏఈలు, లైన్‌మెన్‌లు ఉన్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే మా ధ్యేయమని మన్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక, టీడబ్ల్యూయూ రీజియన్‌ ఇన్‌చార్జి ఎంఆర్‌రావు అన్నారు. ఆదివారం మెదక్‌ డిపో ఎదుట సంబురాలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్‌ జిల్లా ఆర్టీసీ డిపోలలో కాంగ్రెస్‌ బలపరిచిన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌కు గుర్తింపు లభించడం హర్షనీయమన్నారు. ఈనెల 17న శనివారం సాయంత్రం వెలువడిన గుర్తింపు ఎన్నికల ఫలితాల్లో 8 డిపోలలో ఆరింటిలో విజయం సాధించి గుర్తింపును దక్కించుకుందన్నారు. కాంగ్రెస్‌ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి శాఖయ్య, డిపో ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడు గంగాధర్‌, శ్రీనివాస్‌రెడ్డి, సుబ్బారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దసరా.. జోష్‌

సదాశివపేట(సంగారెడ్డి): మార్కెట్లలో దసరా కొనుగోళ్ల జోష్‌ నెలకొంది. వ్యాపారవర్గాలు గిఫ్ట్‌ ఆఫర్లు, డిస్కౌంట్‌లు అందిస్తున్నాయి. ముఖ్యంగా వస్త్ర దుకాణాల్లో సందడి నెలకొంది. గతంలో హైదరాబాద్‌, పటాన్‌చెరు లాంటి పట్టణాలకు వెళ్లి కొత్త దుస్తులు కొనుగోలు చేసేవారు. ఈసారి స్థానికంగానే బ్రాండెడ్‌ షోరూంలు అందుబాటులోకి రావడంతో ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. దుకాణదారులు పలు రకాల ఆఫర్లతో ఆకట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement