నారాయణఖేడ్: మండలంలోని పలుగు తండాకు చెందిన నిరుపేద రైతు కూలీలు వాడిత్య యాదునాయక్, పాపీబాయి దంపతుల కుమార్తెలు నివేదిత, అఖిల ఎంబీబీఎస్ సీట్లు సాధించడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. చదువుల కోసం ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా ఆదివారం ఎక్స్ వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు. ‘తనను విద్యార్థినులు కుటుంబ సమేతంగా వచ్చి కలవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. పేదరికం ప్రతిభకు అడ్డంకి కారాదనే బలమైన సంకల్పంతో కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని నెలకొల్పారని, నేడు క్షేత్రస్థాయి లో అద్భుత ఫలితాలను ఇస్తోంది’ అని అన్నారు. వా రి తల్లిదండ్రులకు అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నత వైద్యులుగా ఎదిగి, పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని ఆకాంక్షించారు. ఎంబీబీఎస్ చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో చదువు పూర్తయ్యే వరకు తాను ఆర్థిక సహాయం అందిస్తానని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.
ఎక్స్ వేదికగా హరీశ్‌రావు హర్షం


