వెజిడబుల్‌ కొనలేం! | - | Sakshi
Sakshi News home page

వెజిడబుల్‌ కొనలేం!

Oct 19 2026 7:47 AM | Updated on Oct 19 2026 7:47 AM

ఎల్‌నినోతో కూరగాయల ధరలకు రెక్కలు

ఎల్‌నినో ప్రభావంతో దసరా పండుగ వేళ కూరగాయల ధరలు అకాశాన్నంటాయి. టమాటా తప్ప ఏ కూరగాయ ముట్టుకున్న భగ్గుమంటోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఏం కొనలేక.. ఏం తినలేక ఇక్కట్లు పడుతున్నారు. – సదాశివపేట(సంగారెడ్డి)

కిలో ఎల్లిగడ్డ రూ.200, అల్లం రూ. 180, బీన్స్‌, చిక్కుడు ధర కిలో రూ. 90కి విక్రయిస్తున్నారు. మిర్చి కిలో రూ. 100 తగ్గడం లేదు. బెండ, క్యారెట్‌, కాకరకాయ, చామగడ్డ, చింతకాయ, కిలో రూ. 60 నుంచి రూ. 80 వరకు విక్రయిస్తున్నారు. వారానికి సరిపడా కొంటే రూ. 500పైగా ఖర్చువుతోందని ప్రజలు వాపోతున్నారు. ఉల్లిగడ్డ ధర రోజురోజుకూ పెరుగుతుంది. ఒక్క టమాట మాత్రం కిలో రూ. 40 పలుకుతోంది. మిగితా అన్నిరకాల కూరగాయలు కిలో రూ. 80 వరకు విక్రయిస్తున్నారు. అకుకూరల ధరలు అదేస్థాయిలో పెరిగాయి. రూ. 20కి నాలుగు కట్టల చొప్పున పాలకూర, మెంతి, తోటకూర, గొంగూర విక్రయిస్తున్నారు. కొత్తిమీర, పూదిన రూ. 5కు కట్ట చొప్పున విక్రయిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వానలు లేక తోటలు ఎండిపోతున్నాయని, అందుకే కూరగాయల దిగుబడి తక్కువై ధరలు అధికమయ్యాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. సదాశివపేట పట్టణానికి హైదరాబాద్‌ కూరగాయల మార్కెట్‌ ఇతర ప్రాంతాలను నంచి నిత్యం 10కి పైగా ఆటోలలో సరఫరా అవుతున్నాయి.

వంటింటి బడ్జెట్‌కు తిప్పలు

కూరగాయల ధరలు పెరగడంతో మధ్య, పేద కుటుంబాలు కొనుగోళ్లలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. గతంలో ఒకేసారి నాలుగైదు రకాల కూరగాయలు కొనుగోలు చేసిన కుటుంబాలు ప్రస్తుతం ధరలను చూసి తక్కువ కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నారు. కుటుంబ ఖర్చులను నిర్వహించడం కష్టంగా మారుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు పెరగడంతో నెలవారీ బడ్జెట్‌ తలకిందులవుతోందని చెబుతున్నారు, ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అవసరం మేర లభించని వైనం

దసరా వేళ ప్రజలపై ఆర్థిక భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement