కాసుల కక్కుర్తి! | - | Sakshi
Sakshi News home page

కాసుల కక్కుర్తి!

Oct 18 2026 7:39 AM | Updated on Oct 18 2026 7:39 AM

చెక్‌ చేశాకే పంపిస్తాం

కరువులోనూ
టీఆర్‌ సెంటర్ల ‘మాయాజాలం’

మెదక్‌ టీఆర్‌ సెంటర్‌లో కాలిన ట్రాన్స్‌ఫార్మర్లు

మెతుకుసీమలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేకపోవటంతో రైతులు బోరుబావుల ఆధారంగా వ్యవసాయం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1.10 లక్షల పైచిలుకు బోరుబావులుండగా, 26 వేల పైచిలుకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాట్లు చేశారు. వీటి మరమ్మతుల కోసం జిల్లాలోని మెదక్‌, రామాయంపేట, తూప్రాన్‌, నర్సాపూర్‌, పాపన్నపేట మండల కేంద్రాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేర్‌ (టీఆర్‌) సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఐదు టీఆర్‌ సెంటర్లు ప్రైవేట్‌ కాంట్రాక్టుల ఆధీనంలో కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చెరువులు, కుంటల్లోకి చెప్పుకోదగ్గ నీరు చేరలేదు. పంటలు చేతికందాలంటే మరో 20– 25 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం లోఓల్టేజీ సమస్యతో నిత్యం 50– 60కి పైగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాలిన ట్రాన్స్‌ఫార్మర్లను రిపేర్‌ సెంటర్‌కు తీసుకురావడంతో షెడ్లలో నాణ్యతలేని మెటీరియల్‌ అమరుస్తున్నారు. సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు ఆన్‌ఆఫ్‌లు అమర్చకున్నా అమర్చినట్లు తప్పుడు లెక్కలు రాస్తున్నారు. రాడ్స్‌, బుష్‌లు వేయకున్నా వేసినట్లు రికార్డుల్లో చూపించి బిల్లులు డ్రా చేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో కాలిన ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేసినా అవి ఆరు నెలలు తిరగకుండానే మళ్లీ కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు కాపర్‌ సెంటర్లలో..

జిల్లావ్యాప్తంగా 5 ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేర్‌ సెంటర్లు ఉండగా, వాటిలో పాపన్నపేట, నర్సాపూర్‌ సెంటర్లలో మాత్రం (కాపర్‌) వైర్‌ అమర్చుతున్నారు. గతంలో 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించి మూడు బోరు బావులకు ఒక్క 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను అమర్చిన సందర్భంలో ప్రభుత్వం ఆ రెండు టీఆర్‌ సెంటర్లకు కాపర్‌వైర్‌ను ఏర్పాటు చేయించింది. కాగా అల్యూమినియంకు చెందిన 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే రూ. 25 వేల ఖర్చు వస్తుండగా, అదే కాపర్‌ వైర్‌ అమరిస్తే రూ. 43 వేల ఖర్చు వస్తోంది. ఈలెక్కన రూ.18 వేల వ్యత్యాసం ఉంటుంది. కిలో అల్యూమినియం వైర్‌ ధర రూ. 350 వరకు ఉండగా, కిలో కాఫర్‌ వైర్‌ ధర రూ. 700 వరకు పలుకుతుండటంతో ఇక్కడ విధులు నిర్వర్తించే అధికారులతో పాటు కాంట్రాక్టర్లకు మరింత ఆదాయం సమకూరుతుందని సమాచారం.

రవాణ ఖర్చు రైతులపైనే..

ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే నిబంధనల ప్రకారం రైతుల పొలాల వద్దకు తరలించేందుకు ప్రభుత్వ వాహనం ఏర్పాటు చేయాలి. కానీ ఈ ఇవి ఎక్కడా అమలు కావటం లేదు. రైతులే డబ్బులు పోగుచేసుకుని ప్రైవేట్‌ వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. సెంటర్లలో విధులు నిర్వర్తించే అధికారులు మాత్రం వాహనాన్ని పంపినట్లు అందుకు సంబంధించిన డీజిల్‌ బిల్లులు సైతం డ్రా చేసుకుంటున్నట్లు తెలిసింది.

కాలిన ట్రాన్స్‌ఫార్మర్లకు నాణ్యతలేని పరికరాలు

6 నెలలు తిరగకుండానే కాలిపోతున్న వైనం

రికార్డుల్లో చూపిస్తూ బిల్లులు డ్రా

అధికారుల పర్యవేక్షణ కరువు

ఎల్‌నినో మోసుకొచ్చిన కరువు కొందరికి కాసులు కురిపిస్తోంది. సరైన వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీటిమట్టం తగ్గిపోవడంతో లోఓల్టేజీ కరెంట్‌ సమస్య తలెత్తుతోంది. దీంతో జిల్లాలో నిత్యం 50 నుంచి 60 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి టీఆర్‌ సెంటర్లకు చేరుతున్నాయి. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. వీటికి నాణ్యతలేని పరికరాలు అమర్చి కాంట్రాక్టర్‌, అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. రికార్డుల్లో తప్పుడు లెక్కలు చూపించి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. – మెదక్‌జోన్‌

ప్రైవేట్‌ వ్యక్తులతో బిల్లులు

టీఆర్‌ సెంటర్లలో అక్రమగా ప్రైవేట్‌ వ్యక్తులను ఏర్పాటు చేసి వారితోనే బిల్లులు చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత శాఖకు చెందిన ఏఈలు చేయాల్సిన బిల్లులను ప్రైవేట్‌ వ్యక్తులను ఏర్పాటు చేసి అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం. ఇందుకు ఉన్నతాధికారుల పర్యేక్షణ లేకపోవటమే కారణమని తెలుస్తోంది.

టీఆర్‌ సెంటర్లలో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు పూర్తి చేసికాఫర్‌ వైరున అనంతరం వాటిని చెక్‌ చేసి పంపిస్తాం. ఒక్కసారి మరమ్మతులు చేసి పంపించాక వాటికి ఆరు నెలల వరకు గ్యారంటీ ఉంటుంది. ఆ లోపల కాలిపోతే సంబంధిత సెంటర్‌ కాంట్రాక్టరే భరించాల్సి ఉంటుంది.

– వెంకటేశ్వర్లు, ఏఈ, టీఆర్‌ సెంటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement