మల్లె చెరువు సందర్శన | - | Sakshi
Sakshi News home page

మల్లె చెరువు సందర్శన

Oct 18 2026 7:39 AM | Updated on Oct 18 2026 7:39 AM

మల్లె చెరువు సందర్శన నీటి సంరక్షణకు ప్రాధాన్యం రైతుల గోస పట్టదా..? రోస్టర్‌ విధానంలోనే ఎంపిక

రామాయంపేట(మెదక్‌): కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్న మల్లె చెరువు ఎఫ్‌టీఎల్‌ను శనివారం మెదక్‌ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు. బఫర్‌ జోన్‌ ఆక్రమణకు గురైతే వెంటనే తొలగించాలని ఆమె ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులతో కలిసి చెరువు బఫర్‌ జోన్‌ను ఫిక్స్‌ చేయాలని ఇరిగేషన్‌ ఏఈని ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్‌ రజని, మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌, ఇతర అధికారులున్నారు.

అదనపు కలెక్టర్‌ నగేశ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మొదటి ప్రాధాన్యతగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఎల్‌నినో ప్రభావంపై ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సమీక్షించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. వీబీజీ రామ్‌జీ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ కోసం నీటి గుంతలు, ఫాంపాండ్‌ల ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హవేళిఘణాపూర్‌(మెదక్‌): రైతుల పంటలు ఎండిపోయిి మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని తెలంగాణ రక్షణ సేన మెదక్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బట్టి అజయ్‌ అన్నారు. శనివారం మెదక్‌ మండలం గుట్టకిందిపల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు మనోధైర్యం కల్పించారు. రైతుల సమస్యల పట్ల కనీసం అవగాహన లేని పాలకులు నియోజకవర్గంలో ఉండడం పట్ల రైతులు అందోళన చెందుతున్నారని వాపోయారు. కనీసం తమ పంటలు ఎండిపోతుంటే అధికారులు వెళ్లి ఆదుకుంటామని హామీ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. రైతులకు భరోసానిచ్చేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు రోస్టర్‌ విధానం, కేటగిరి రిజర్వేషన్‌ మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో డీపీఓ యాదయ్యతో కలిసి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 69 పోస్టులకు 67 మంది హాజరు కాగా, మరో ఇద్దరు అభ్యర్థులు గైర్హాజరైనట్లు చెప్పారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం కలెక్టర్‌ ఆదేశాల మేరకు విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement