పాపన్నపేట(మెదక్)/మెదక్ కలెక్టరేట్: ఎల్‌నినోను ఎదుర్కోవాలంటే భూగర్భజలాలను పరిరక్షించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. శనివారం మండల పరిధిలోని కొత్తపల్లిలో వీబీజీ రాంజీ పథకం పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫాంపాండ్ల నిర్మాణంతో పంటల సాగుకు నీటి కొరత లేకుండా ఉంటుందన్నారు. వీటి నిర్మాణ పనుల్లో ఎక్కువ మంది ఉపాధి కూలీలు పాల్గొనేలా చూడాలని అధికారులకు సూచించారు. సామూహిక ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి రోజు ఎంత మంది కూలీలు హాజరవుతున్నారనే విషయాన్ని అధికారులకు తెలపాలని చెప్పారు. చెక్ డ్యాంల నిర్మాణం, మరమ్మతులు, ఇతర నీటి సంరక్షణకు సంబంధించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆమె వెంట డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ సతీశ్‌కుమార్, ఎంపీడీఓ విష్ణువర్ధన్, మాజీ సర్పంచ్ జగన్, అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో గృహనిర్మాణ శాఖ అధికారులతో గూగుల్ మీట్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు మొదలు పెట్టని మొదటి, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


