దివ్యాంగుల ప్రతిభ దేశానికే ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల ప్రతిభ దేశానికే ఆదర్శం

Oct 18 2026 7:39 AM | Updated on Oct 18 2026 7:39 AM

నర్సాపూర్‌ రూరల్‌: గ్లాస్గో కామన్‌ వెల్త్‌ క్రీడల్లో దివ్యాంగుల ప్రతిభ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శనివారం నర్సాపూర్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని దివ్యాంగులకు పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన ‘సశక్త దివ్యాంగ్‌ జన్‌, సమర్థ భారత్‌’ పథకంలో భాగంగా దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన గ్లాస్గో కామన్‌ వెల్త్‌ క్రీడల్లో మన దేశ దివ్యాంగులు ప్రపంచస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచారని గుర్తుచేశారు. దివ్యాంగులకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఇక నుంచి అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులను గుర్తించేందుకు మండల కేంద్రాల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి హేమాభార్గవికి సూచించారు. నర్సాపూర్‌ ప్రాజెక్టు పరిధిలో 123 మంది దివ్యాంగులను గుర్తించి 231 రకాల పరికరాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, వైస్‌ చైర్మన్‌ బుచ్చేశ్‌ యాదవ్‌, జిల్లా బీజేపీ అధ్యక్షుడు వల్దాస్‌ మల్లేశ్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, నాయకులు పాల్గొన్నారు.

ఎంపీ రఘునందన్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement