ఎమ్మెల్యే సంజీవరెడ్డి
కల్హేర్(నారాయణఖేడ్): ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలతో నియోజకవర్గంలోని విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మహదేవుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే సిర్గాపూర్ మండలం వాసర్‌లో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. చందర్‌నాయక్ తండా పంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. నల్లవాగు ప్రాజెక్టులో నీటి నిల్వ పరిశీలించి అధికారులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాణ్యత పాటించి నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నల్లవాగు ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కర్‌సేట్, సర్పంచ్‌లు శ్రీనివాస్‌రావు, రుక్మిణి, నాయకులు యాదవరెడ్డి, రవీందర్‌రెడ్డి, గోపాల్ పాల్గొన్నారు.


