కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం వార్షిక తనిఖీలో భాగంగా కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చోరీలు, నేరాలు తగ్గించేందుకు విలేజ్ పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసినట్లు చెప్పారు. నేరస్తులకు శిక్ష పడేలా పక్కా ఆధారాలు సేకరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం చేస్తున్నట్లు చెప్పారు. దొంగతనాల నియంత్రణకు నిఘా పెంచి, రాత్రి పెట్రోలింగ్ ముమ్మరం చేసినట్లు వివరించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాల గురించి ఎవరి దృష్టికై నా వస్తే సమాచారం ఇవ్వాలన్నారు. వారిపేరు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. పోలీసులు క్రమశిక్షణతో, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆయన వెంట తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐలు రంగాకృష్ణ, సందీప్‌రెడ్డి, ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి పోలీసులు పాల్గొన్నారు.
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు


