నర్సాపూర్: ప్రజల ప్రాణాలతో హోటళ్ల నిర్వాహకులు చెలగాటం ఆడొద్దని ఎమ్మెల్యే సునీతారెడ్డి హితవు పలికారు. ఇటీవల పట్టణంలోని ఓ హోటల్లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శనివారం పరామర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పండుగ పూట ఇలాంటి ఘటన జరగడం విచారకరమన్నారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తినుబండారాల్లో నాణ్యత లేని సరుకులు వాడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోమని హెచ్చరించారు. హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఆయా శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, విఫలమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాయికుమార్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి


