పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డిప్యూటీ కమిషనర్ పీజే వెస్లీ
నర్సాపూర్ రూరల్: మండలంలోని ఎల్లారెడ్డిగూడ పంచాయతీని ఆదర్శంగా తీసుకోవాలని ఇతర గ్రామాల సర్పంచ్‌లు, కార్య దర్శులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డిప్యూటీ కమిషనర్ పీజే వెస్లీ సూచించారు. శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. సర్పంచ్ బిక్యా నాయక్‌తో పాటు కార్యదర్శి పనితీరు బాగుందన్నా రు. ముందుగా పంచాయతీ పరిధిలోని అన్ని వీధుల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్‌లో కంపోస్టింగ్ యూనిట్, పల్లె ప్రకృతి వనం, నర్సరీ నిర్వహణ వంటి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం పంచాయతీలో రికార్డుల నిర్వహణ, 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ, పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలుతో పాటు పంచాయతీ ఆస్తుల పరిరక్షణ, రికార్డుల నిర్వహణను పరిశీలించి అభినందించారు. అనంతరం సర్పంచ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో డీపీఓ యాదయ్య, డీఎల్‌పీఓ సురేశ్‌బాబు, ఎంపీఓ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


