ఉమ్మడి జిల్లా
నోడల్ అధికారి వాణిప్రసాద్
జిన్నారం(పటాన్చెరు): ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం, భూగర్భజలాల తగ్గుదల నేపథ్యంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి వాణిప్రసాద్ అధికారులను ఆదేశించారు. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధా న్యం ఇవ్వాలని, నీటి వృథాను అరికట్టి పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. శుక్రవారం గుమ్మడిదల మండలం కానుకుంటలో అదనపు కలెక్టర్ సంగీతతో కలిసి పంటలను పరిశీలించారు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని, పంట పొలాల్లో ఫామ్పాండ్స్ నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం గుమ్మడిదల తహసీల్దార్ కార్యాలయంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా ల అధికారులతో సమీక్ష నిర్వహించారు.


