తూప్రాన్‌లో మినీ స్టేడియం స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

తూప్రాన్‌లో మినీ స్టేడియం స్థల పరిశీలన

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రమేశ్‌

తూప్రాన్‌: పట్టణంలో మినీ స్టేడియం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి గంగాల రమేశ్‌ బుధవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీఓ బావయ్యతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. పట్టణంలోని డబుల్‌ బెడ్రూం ఇళ్ల సమీపంలోని సర్వే నంబర్‌ 325లో మినీ స్టేడియం నిర్మాణం కోసం ప్రభుత్వం గతంలోనే 4.20 ఎకరాల స్థలాన్ని కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలోనే నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నర్సాపూర్‌ పట్టణంలో రూ.2.65 కోట్ల నిధులతో నిర్మించనున్న మినీ స్టేడియానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉందన్నారు. అలాగే రామాయంపేటలో మినీ స్టేడియం నిర్మాణం కోసం స్థల సేకరణ జరగాల్సి ఉందని వివరించారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ఈ మినీ స్టేడియాలు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ యువతలోని ప్రతిభను వెలికితీసి, వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేలా తీర్చిదిద్దేందుకు ఈ స్టేడియాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement