సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి టౌన్: విద్యహక్కుచట్టంపై బాలికలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డిలోని బాలసదన్‌లో బుధవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవ వే డుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..బాలికలు వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు ఇతరుల తో పంచుకోవద్దని స్పష్టం చేశారు. లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో వాటిని సాధించాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.


