గుట్టుగా రాష్ట్రస్థాయి అధికారి పర్యటన | - | Sakshi
Sakshi News home page

గుట్టుగా రాష్ట్రస్థాయి అధికారి పర్యటన

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

నర్సాపూర్‌ రూరల్‌: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక అధికారి జయరాం నర్సాపూర్‌ మండలంలో గుట్టుచప్పుడు కాకుండా పర్యటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మండలంలోని గొల్లపల్లి, నారాయణపూర్‌, అచ్చంపేట గ్రామాల్లో ఆయన పర్యటించినట్లు ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. అయితే రాష్ట్రస్థాయి అధికారి పర్యటన విషయాన్ని స్థానిక మండల స్థాయి అధికారులు మీడియాకు, స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్‌నినో ప్రభావంతో అడుగంటిన భూగర్భ జలాలను పెంచడంతోపాటు గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో వీబీజీ రామ్‌ జీ పథకం కింద కూలీలకు 125 రోజుల పనులు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా కూలీలకు పనులు కల్పించేందుకు వ్యక్తిగత ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్‌ పిట్స్‌, ఫామ్‌ పాండ్స్‌, బోర్‌ రీచార్జ్‌ స్ట్రక్చర్లు, సైడ్‌ డ్రమ్స్‌ వంటి పనులు చేపడుతున్నారు. ఈ ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగినందునే అధికారులు ఈ పర్యటనను గోప్యంగా ఉంచారని స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారి పరిశీలనలో ఏం తేలిందో బయటపెట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ భారతితోపాటు ఏపీఓ అంజిరెడ్డిని వివరణ కోరగా బిజీగా ఉన్నామని చెప్తున్నారు.

పలు అనుమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement