448 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

448 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో సహకారశాఖ ఆధ్వర్యంలో 448 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా సహకార శాఖ అధికారి పద్మ వెల్లడించారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ...ఇప్పటికే జిల్లాలో 37 సహకార సంఘాల పరిధిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో గతంలోకంటే ఎక్కువగా వరిధాన్యం వచ్చే అవకాశాలు కనిపించడం లేదని తెలిపారు. ప్రస్తుతం రైతులంతా నవరాత్రి ఉత్సవాల్లో నిమగ్నమై ఉన్నారని, దసరా తర్వాత కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తుందని తెలిపారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లోనూ టార్పలిన్లు, గన్నీ బ్యాగ్స్‌లు సిద్ధంగా ఉంచామని తెలిపారు. అలాగే తూర్పార మిషన్లు కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకోసం కనీస వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్నధాన్యానికి ప్రభుత్వం బోనస్‌ ఇస్తుందని తెలిపారు. సన్నరకం ధాన్యాన్ని గుర్తించేందుకు బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యార్థులకోసం నోటిఫికేషన్‌ వేసినప్పటికీ ఎవరూ రాలేదని తెలిపారు. పీఏసీఎస్‌ పరిధిలో గల సాంకేతిక నిపుణులైన సిబ్బందికి సన్నరకం వరిధాన్యాన్ని గుర్తించే శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. వారి ద్వారానే సన్నరకం ధాన్యాన్ని గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. ధాన్యం విక్రయించిన 48గంటల్లోనే డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

జిల్లా సహకారశాఖ అధికారి పద్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement