విద్యుత్‌ కోసం రైతుల రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కోసం రైతుల రాస్తారోకో

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

చేగుంట(తూప్రాన్‌): చివరి దశలో ఉన్న వరికి నీటిని అందించేందుకు నిరంతర విద్యుత్‌ అందించాలని మక్కరాజీపేట గ్రామంలో బుధవారం రైతులు గజ్వేల్‌–చేగుంట రహదారిపై రస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..వ్యవసాయ పొలాలకు ఆరు గంటలే విద్యుత్‌ను అందిస్తుండటంతో చివరి దశలో ఉన్న వరిపంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆరుగంటల విద్యుత్‌ సైతం మధ్యలో అంతరాయమేర్పడుతుండటంతో పొలాలకు నీటిని అందించలేకపోతున్నట్లు తెలిపారు. చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని నిరసన విరమించాలని కోరగా విద్యుత్‌ శాఖ అధికారులు వచ్చేవరకు రాస్తారోకో విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. విద్యుత్‌ అధికారులు రామాయంపేట ఏడీఏ ఆదయ్య, ఏఈ వెంకటఅప్పారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని హామీనివ్వడంతో రైతులు నిరసన విరమించారు. కార్యక్రమంలో రైతులు రాజిరెడ్డి, రమేశ్‌, శ్రీనివాస్‌, సత్తిరెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్‌, యాదిరెడ్డితో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement