అన్నపూర్ణదేవిగా దుర్గమ్మ | - | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణదేవిగా దుర్గమ్మ

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

కేసుల దర్యాప్తులో వేగం పెంచండి పనులు త్వరగా పూర్తి చేయాలి

పాపన్నపేట(మెదక్‌): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వన దుర్గమ్మ అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని నీలం రంగు వస్త్రాలతో అలంకరించారు. అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ వీరేశం భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

మెదక్‌జోన్‌: పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో పాల్గొని మాట్లాడారు. గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌, మిస్సింగ్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో తదితర కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు. కేసులు పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. గ్రేవ్‌ కేసుల్లో సంఘటనా స్థలంలో లభించే ఆధారాలను పకడ్బందీగా సేకరించాలన్నారు. మిస్సింగ్‌ కేసుల్లో బాధితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేయా లని ఆదేశించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రా ఫిక్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌, డీఎస్పీలు ప్రసన్న కుమార్‌, నరేందర్‌గౌడ్‌, సుభాశ్‌ చంద్రబోస్‌, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

తూప్రాన్‌: మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు అల్లాపూర్‌ చెరువు కట్ట వద్ద నిర్మాణంలో ఉన్న బతుకమ్మ ఘాట్‌ పనులను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజని మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకొని నిర్మాణ నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు. బతుకమ్మ పండుగ నాటికి పనులన్నీ పూర్తి కావాలన్నారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్‌, సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌కుమార్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌ గౌడ్‌, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

‘ఆడపిల్లను బతకనిద్దాం’

మెదక్‌ కలెక్టరేట్‌: ఆడపిల్ల పుట్టడం భారంగా కాకుండా సంతోషంగా భావించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. మంగళవారం పట్టణంలోని కేవల్‌ కిషన్‌ భవనం వద్ద సీఐటీయూ, ఎన్‌పీఆర్డీ ఆధ్వర్యంలో శ్రామిక బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నప్పటికీ, ఇంకా ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలను అరికట్టి, ప్రతి బాలిక చదువుకునేలా తల్లిదండ్రులు, సమాజం బాధ్యత తీసుకోవాలని కోరారు. మహిళల హక్కులు, గౌరవం, సమానత్వం గురించి చాటిచెప్పేలా శ్రామిక బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి, కోశాధికారి నర్సమ్మ, జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నాయకులు నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, దుర్గ, కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement